TDP: దెయ్యాలు వేదాలు చెప్పటం అంటే ఇదే.. జగన్ పోస్ట్‌కు టీడీపీ కౌంటర్

by Ramesh Goud |   ( Updated:2024-11-04 12:39:30.0  )
TDP: దెయ్యాలు వేదాలు చెప్పటం అంటే ఇదే.. జగన్ పోస్ట్‌కు టీడీపీ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దెయ్యాలు వేదాలు చెప్పటం అంటే ఇదేనని తెలుగుదేశం పార్టీ(TDP Party) ట్వీట్ చేసింది. సోషల్ మీడియా కార్యకర్తలను నిర్బంధించడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని వైసీపీ నేత, మాజీ సీఎం జగన్(YS Jagan) చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా జగన్.. తమరు ముఖ్యమంత్రిగా ఉండగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆస్తులు సీజ్ చేస్తాం అన్నారు మర్చిపోయారా అని, నీ అసమర్ధతని ప్రశ్నించిన 70 సంవత్సరాల వయసున్న రంగనాయకమ్మ(Ranganayakamma)ను జైల్లో పెట్టావ్ మర్చిపోయావా అని ప్రశ్నించింది.

అలాగే నీ కేసులు గురించి మాట్లాడిన సుప్రీమ్ కోర్ట్ జడ్జి(Supreme Court Judge)లను దూషించావ్ మర్చిపోయావా అని, నీ పరిపాలన గురించి విమర్శించిన మహిళలు అని చూడకుండా నీ పేటీఎం బ్యాచ్‌(Paytm Batch)కి డబ్బులు ఇచ్చి తిట్టించావ్ మర్చిపోయావా అని మండిపడింది. అరెస్టులు చేపించావ్, కొట్టించావ్, వేధించావ్, హింస పెట్టావ్ మర్చిపోయావా అంటూ.. తాము ఇప్పుడు చట్టప్రకారం చేస్తున్నామని చెప్పింది. మహిళలపై నువ్వు బూతులు తిట్టిస్తూ ఉంటే చూస్తూ ఉండమని, నీకు అంటే ఇంట్లో చెల్లిని, తల్లిని కూడా బూతులు తిట్టించే అలవాటు వుందని చెబుతూ.. మేము నీలాంటి సైకోలు కాదు కదా అని వ్యాఖ్యానించింది. అందుకే చట్ట ప్రకారం వ్యవహరిస్తూ మహిళలకి అండగా ఉంటున్నామని టీడీపీ స్పష్టం చేసింది.

Advertisement

Next Story