- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TDP: నెయ్యి విషయంలో జగన్‌కు ఆ సంస్థలు కనిపించలేదా..? టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేయడం సంతోషకరమైన వార్త అని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన టీటీడీ రివర్స్ టెండరింగ్ విధానం రద్దు పై స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చారని, దీని పేరుతో తిరుమలకు సరఫరా చేసే నెయ్యి నాణ్యతను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. దీని ద్వారా ట్రేడింగ్ చేసే నార్త్ ఇండియా సంస్థలకు మాత్రమే టెండర్లు కట్టబెట్టారని తెలిపారు.
అలాగే గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్ల విధానంలో మొత్తం 9 సంస్థలు బిడ్ చేస్తే.. పక్క సంస్థల నుంచి నెయ్యి తెచ్చుకొనే ఏఆర్ డెయిరీకి అప్పగించారని అన్నారు. నెయ్యి విషయంలో దొడ్ల, తిరుమల, విజయ, సంగం డెయిరీలు జగన్ కు కనిపించలేదా అని ప్రశ్నించారు. అంతేగాక పాల ధర పెరుగుతుంటే నెయ్యి ధర తగ్గడం ఏంటో అర్థం కాలేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. కాగా తిరుమల తిరుపతి దేశస్థానంలో గత ఐదేళ్లుగా అమలులో ఉన్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ విధానం రద్దుపై ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఆదేశాలతో టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసినట్లు తెలిసింది. ఈ విధానంలో టెండర్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసి, పాత విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.