అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్‌ల సమ్మెకు టీడీపీ మద్దతు: ఆచంట సునీత

by Seetharam |
అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్‌ల సమ్మెకు టీడీపీ మద్దతు: ఆచంట సునీత
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఈ నెల 12న రాష్ట్రంలోని అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేపట్టే నిరవధిక సమ్మెకు టీడీపీ అనుబంధ సంస్థ తెలుగునాడు అంగన్ వాడీ ట్రేడ్ యూనియన్ (టిఎన్ టీయూ) మద్దతిస్తోందని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. న్యాయపరమైన హక్కుల కోసం అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు పోరాడటంలో అర్థముంది. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కు ఇచ్చిన హామీల్లో నాలుగున్నర సంవత్సరాలు గడచినా ఏ ఒక్కటి నెరవేర్చలేదు అని ఆరోపించారు. ప్రభుత్వం వారికి చేసింది శూన్యమన్నారు. ‘అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్లకు ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేయలేదు. సంక్షేమ పథకాలకు వీరు అనర్హులని నిర్ధారించడం బాధాకరం. ధర్నాలు చేస్తూ రోడ్లమీదికి వస్తే.. వారితో చర్చలు జరుపుదామనే ఆలోచన ప్రభుత్వానికి ఏ కోశాన లేదు. అంగన్వాడీ సెంటర్లు అధ్వాన్న స్థితిలో ఉంటే సమీక్షించిన దాఖలాలు మచ్చుకైనా లేవు. నాయకులకు సకల సదుపాయాలు, అంగన్ వాడీ టీచర్లు, వర్కర్లకు జీతాలలో ఆలస్యం.. ఇదెక్కడి న్యాయం?’ అని ఆచంట సునీత నిలదీశారు. ‘ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు ఏర్పాటు చేసిన సెంటర్లను వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. జగన్ తన పాదయాత్రలో గొప్పగా అంగన్వాడీలకు జీతాలు పెంచుతామన్నారు. అంగన్వాడీ స్కూళ్లల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అంగన్వాడీ టీచర్లకు, వర్కర్లకు తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలిస్తాని హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటి అమలు పక్కన పెట్టి నయవంచనకు గురి చేశారని ఆరోపించారు. ‘టీడీపీ హయాంలో చంద్రబాబు అంగన్వాడీ టీచర్లకు రూ.4,200 ఉన్న జితాన్ని రూ. 10,500 చేశారు. 2 వేలు ఉన్న హెల్పర్ల జీతాలను 6 వేలకు పెంచారు. వారికి సంక్షేమ పథకాలను అందించారు. మనో వికాస కేంద్రాలను పెట్టి వాటిని తీర్చిదిద్దారు. తల్లి, బిడ్డ క్షేమం కోరారు. పేద బిడ్డలకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించారు’ అని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత తెలిపారు.


ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా?

‘ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా? ఆశ వర్కర్లకు, డ్వాక్రా యానిమేటర్లకు అనేక రకాల హామీలిచ్చి మోసం చేశారు. ముఖ్యమంత్రి జగన్, స్త్రీ శిశు శాఖా మంత్రి ఉషశ్రీ చరణ్, సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి బయటికి వచ్చి సెంటర్లను విజిట్ చేయాలి. అంగన్వాడీ సిబ్బంది బాధలను తెలుసుకోవాలి’ అని ఆచంట సునీత డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ టీచర్స్‌కు తప్పక న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. వైసీపీని నమ్మే పరిస్థితులు లేవు. వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని హెచ్చరించారు. టీడీపీ తప్పక గెలుస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. అంగన్వాడీ సిబ్బందికి తప్పక న్యాయం చేస్తారు...అంగన్ వాడీ సెంటర్లను అభివృద్ది చేస్తారు అని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో అంగన్వాడీల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చే బాధ్యత టీడీపీది. 90 రోజులు వెయిట్ చేయాలి. అధైర్యపడొద్దు, అండగా ఉంటాం. 12 నుంచి చేస్తున్న సమ్మెకు, పోరాటానికి టీడీపీ తరపున మద్దతిస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed