Cbn Arrest Effect: ఢిల్లీకి నారా లోకేశ్.. కేంద్ర పెద్దలను కలిసే ఛాన్స్

by srinivas |   ( Updated:2023-09-14 14:42:18.0  )
Cbn Arrest Effect: ఢిల్లీకి నారా లోకేశ్.. కేంద్ర పెద్దలను కలిసే ఛాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో ఆ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. నారా లోకేశ్‌తో పాటు ఎంపీ రామ్మోహనాయుడు హస్తినకు వెళ్లారు. అయితే అక్కడ కేంద్ర పెద్దలను కలిసి చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను వివరించనున్నారని తెలుస్తోంది. అలాగే మరికొద్ది రోజుల్లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనూ చంద్రబాబు అరెస్ట్‌ అంశాన్ని గట్టిగా వినిపించాలని భావిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ ఎంపీలను కలిసి దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాదు ఏసీబీ కోర్టు, హైకోర్టు‌లో చుక్కెదురైతే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు లాయర్లను సైతం నాారా లోకేశ్ కలుస్తారని పార్టీ నేతలు అంటున్నారు.

మరోవైపు పవన్ కల్యాణ్ కూడా బీజేపీ పెద్దలతో మాట్లాడతానని చెప్పారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు. అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీతో మాట్లాడి మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లే దిశగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. దీంతో చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని డైరెక్ట్‌గా నారా లోకేశ్‌నే ప్రధాని మోదీ, అమిత్ షా తో పాటు పలువురు కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇక చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును జైలులోని స్నేహ బ్లాక్‌లో ఉంచి ప్రత్యేక ఖైదీగా సౌకర్యాలు కల్పించారు. ఇవాళ చంద్రబాబును పవన్ కల్యాణ్, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనంతరం పొత్తులపై పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. కొద్ది రోజుల్లో ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో నారా లోకేశ్ ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed