Breaking: టీడీపీ ఎమ్మెల్యే వెలపూడికి బెదిరింపు కాల్స్

by srinivas |   ( Updated:2024-02-25 14:19:45.0  )
Breaking: టీడీపీ ఎమ్మెల్యే వెలపూడికి బెదిరింపు కాల్స్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ తూర్పు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే వెలకపూడి రామకృష్ణకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ అభ్యర్థిగా మరోసారి ఆయనకే అవకాశం దక్కింది. ఈ ఆనందంలో ఉన్న ఆయనకు ఆదివారం ఉదయం నుంచి బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. అంతర్జాతీయ ఫోన్ నెంబర్లతో కాల్ చేసి ఆయనను బెదిరిస్తున్నారు. బూతులు తిడుతూ చంపేస్తామని అగంతకులు హెచ్చరించారు. దీంతో విశాఖ పోలీసులకు వెలగపూడి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే అధికార పార్టీ నేతల నుంచే తమ నేతకు బెదిరింపులు కాల్స్ వస్తున్నాయని టీడీపీ శ్రేణులు అంటున్నారు. జగన్ పాదయాత్రలో కూడా వెలగపూడి గెలిచారని, ఇప్పుడు మరోసారి కూడా ఆయన గెలుస్తారేమోననే భయంతోనే బెదిరింపులకు దిగారని ఆరోపిస్తున్నారు. ఫోన్ కాల్స్ చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story