- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రోజా చిప్పకూడు తినాల్సిందే.. ఎమ్మెల్యే భానుప్రకాశ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: వరదలపై మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహాయక చర్యలు అందిస్తుంటే రోజా విమర్శలు చేయడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన ఎద్దేవా చేశారు. వరదలపై ఏం మాట్లాడుతుందో రోజాకే అర్థం కావట్లేదన్నారు. ప్రజలు ఆపదకాలంలో ఉంటే సహాయం చేయకుండా రోజా దూరంగా ఉండి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన రోజా వరద సహాయంపై విమర్శలు చేయడం శోచనీయమన్నారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో కోట్ల రూపాయలు తినేశారని ఆరోపించారు. రూ. 350 విలువ చేసే బ్యాట్లను రూ. 3500, రూ.6500కు కొన్నట్లు లెక్కల్లో చూపించారని తెలిపారు. దోచుకోవడానికి ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారని విమర్శించారు. మాజీ మంత్రి రోజా ల్యాండ్ కబ్జాలు, స్కాములు త్వరలో బయటకొస్తాయన్నారు. రోజానే కాదని... తప్పు చేసిన ఎవరైనా సరే చిప్ప కూడు తినాల్సిందేనని పుత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ హెచ్చరించారు.