అక్రమ కేసులకు భయపడని చరిత్ర టీడీపీ నాయకులది : టీడీపీ పోలిట్‌ బ్యూరో మెంబర్ నక్కా ఆనంద్‌బాబు

by Shiva |
అక్రమ కేసులకు భయపడని చరిత్ర టీడీపీ నాయకులది : టీడీపీ పోలిట్‌ బ్యూరో మెంబర్ నక్కా ఆనంద్‌బాబు
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్రమ కేసులకు భయపడని చరిత్ర టీడీపీ నాయకులదని టీడీపీ పోలిట్‌ బ్యూరో మెంబర్ నక్కా ఆనంద్‌బాబు అన్నారు. ఇవాళ స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేడు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో తాము సగం విజయం సాధించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కుట్రతో అక్రమ కేసులు బనాయించినా.. తమ అధినేత కడిగిన ముత్యంలా భయటకు వస్తారని పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉండి ఎన్నో పోరాటాలు చేశామని అన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద నేతలతోనే పోరాడిన ఘటన ఒక్క టీడీపీకే దక్కుతుందని పేర్కొన్నారు. రాజకీయంగా బాబును ఎదుర్కొలేకనే సీఎం జగన్ కుట్ర పూరితంగా కేసులు బనాయించి కోర్టు వరకు తీసుకొచ్చారని, తమకు న్యాయస్థాలపై పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఇప్పటికైనా తమనకు సీజే బెంచ్‌లో న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందని అన్నారు. తీర్పు ఆలస్యంగా వచ్చిన చివరకు న్యాయమే గెలుస్తుందని నక్కా ఆనంద్‌బాబు పేర్కొన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story