- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SHRC: దుస్థితిపై సీఎం జగన్‌కు వర్ల రామయ్య లేఖ
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దుస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వంలో కొన్ని ప్రభుత్వ సంస్థల దుస్థితి హృదయ విదారకంగా ఉంది అని లేఖలో ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం బాకా ఊదుకుంటూ ప్రచారం చేసుకోవడం తప్ప చర్యలు శూన్యమని విమర్శించారు. కర్నూలులో ఏర్పాటు చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సి) దుస్థితి ఇందుకు మంచి ఉదాహరణ అని చెప్పారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు కనీసం ఒక స్టెనోగ్రాఫర్‌ను గానీ, టైపిస్ట్‌ను గానీ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం దౌర్భాగ్యమన్నారు. కమిషన్ ఆదేశాలు జారీ చేసేందుకు టైపిస్టు లేకపోవడంతో చైర్‌పర్సనే స్వయంగా టైప్ చేసుకోవడం ప్రభుత్వ సంస్థల దయనీయ స్థితికి అద్దంపడుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇదే విషయాన్ని జత చేసిన ఉత్తర్వులలో గౌరవనీయ చైర్‌పర్సన్ సీతారామ మూర్తి పేర్కొన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి మాత్రం ప్రజల సొమ్ముతో ఆడంబరంగా ప్రచారం చేసుకుంటున్నారు. కనీసం ఇకనైనా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు అవసరమైన సిబ్బందిని, మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. మానవ హక్కుల కమిషన్ లక్ష్యాలను సాధించడానికి సక్రమంగా పని చేయడానికి వీలు కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌కు వర్ల రామయ్య లేఖలో కోరారు.