- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను పార్టీ మారడమేంటి..? టీడీపీ పిల్లర్ నేను..టీడీపీ నేత శ్రీనివాసరావు
దిశ వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ నేత యరపతినేని శ్రీనివాసరావు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మరో రెండు నెలల్లో ముగుస్తుందని జోస్యం చెప్పారు. అలానే తెలుగుదేశం పార్టీ నీతి నియమాలతో పుట్టుకొచ్చిందని పేర్కొన్నారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా టీడీపీ పని చేస్తుందని తెలిపారు. అలాంటి ప్రజాధారణ పొందిన పార్టీకి తానొక మెయిన్ పిల్లర్ ని అని.. అలాంటి నేను టీడీపీ పార్టీ ని కాదని వేరే పార్టీకి ఎలా మారుతాను..? అని ప్రశ్నించారు.
తన పై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. తాను ఏ పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. వైసీపీ లో ఉన్న నేతలే ఆ పార్టీ నుండి బయటకు వస్తున్న నేపథ్యంలో.. ప్రజాస్వామ్య రహితమైన ఆ పార్టీ లో తాను చేరుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా తప్పుడు ప్రచారాలు ఆపకపోతే తగిన గుణపాఠం నేర్పుతాను అని హెచ్చరించారు. కన్నతల్లినీ, సొంత చెల్లిని కాపాడలేక గాలికి వదిలేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మహిళలను కాపాడతాడా? అని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా అంబేడ్కర్ రాజ్యాంగం నడుస్తుంటే.. ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని ఎద్దేవ చేశారు. రూ.500 కోట్ల ప్రజల సొమ్ముతో ప్యాలెస్ కట్టుకుని విశాఖ ఋషి కొండను బోడిగుండు చేశారని విమర్శించారు. ఇక జగన్ అధికారం లో కి వచ్చాక రాష్ట్రం అతలాకుతలం అయ్యిందని తెలిపారు. పోలీసు యంత్రాగాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు.. అధికారం చేతిలో ఉందని.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు పై ఆధారాలు లేని అవినీతి కేసులు మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాశతో నకిలీ లిక్కర్ విక్రయించి లక్షలాది మంది అవయవాలు పనిచేయకుండా చేసిన వ్యక్తి జగన్ అని నిప్పులు కురించారు. జగన్ ధన దాహానికి వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన కర్మ అనుభవించక తప్పదని.. ఆ ప్రకృతి జగన్ మీద పగ పడుతుందని.. ప్రకృతి ఆగ్రహిస్తే జగన్ నిలవలేడు అని వ్యాఖ్యానించారు.