Ap News: రాష్ట్రంలో దళితులపై పెరుగుతున్న దాడులు.. నారా లోకేశ్ ఏమన్నారంటే..

by srinivas |   ( Updated:2023-11-03 10:52:31.0  )
Ap News: రాష్ట్రంలో దళితులపై పెరుగుతున్న దాడులు.. నారా లోకేశ్ ఏమన్నారంటే..
X

దిశ వెబ్ డెస్క్: ఏపీలో దళితులపై నానాటికీ దాడులు పెరుగుతున్నాయి. గత నాలుగేళ్లుగా ఈ దాడుల మరింత ఎక్కువ అయ్యాయి. కరోనా సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్‌ ఉధృంతం ఎంత సంచలన సృష్టించిందో అందరం చూశాం. ఆ తర్వాత దళిత డ్రైవర్ హత్య సైతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. రాష్ట్రంలో ఏదో ఒక చోట దళితులపై జరుగుతున్న దాడుల ఘటనలను ప్రతినిత్యం వింటూనే ఉన్నాం. కానీ ఈ దాడులను మాత్రం అరికట్టలేకపోతున్నారు. తమ ప్రభుత్వం దళిత పక్షి పాతి అని చెప్పుకునే సీఎం జగన్ సర్కార్ ఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటుందే తప్ప చిన్న కులాలను అవమానించొద్దనే అవగాహన తీసుకురాలేకపోతోంది.

తాజాగా కృష్ణా జిల్లా కంచికచర్లలో అమానవీయ ఘటన జరిగింది. కొందరు వ్యక్తులు సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారు. కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. శ్యామ్ కుమార్‌ను బంధించి నాలుగు గంటల పాటు చిత్ర హింసలకు గురి చేశారు. అంతేకాదు దాహం వేస్తుందని శ్యామ్ కుమార్ నీళ్లు అడగటంతో మూత్రం పోసి ఇచ్చారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోంది.

జగన్ పాలనలో దళితులకు లేని రక్షణ

ఇకపోతే ఇదే విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వరకు ఈ ప్రభుత్వంలో చాలా మంది దళితులు బలి అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు మనస్సాక్షి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం తానే బాధితుడినని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ బాబు వాపోవడం జగన్ పాలనలో దళితులపై అణచివేత చర్యలకు పరాకాష్ట అని నారా లోకేశ్ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed