Tdp Win: ఇది క‌దా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్.. నారా లోకేశ్ సెటైర్స్

by srinivas |   ( Updated:2023-03-23 14:37:49.0  )
Tdp Win: ఇది క‌దా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్.. నారా లోకేశ్ సెటైర్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందిన పంచుమర్తి అనురాధను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్, చేనేత ఆడ‌ప‌డుచు, తెలుగుదేశం కుటుంబ‌ స‌భ్యురాలు పంచుమ‌ర్తి అనూరాధకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై సెటైర్లు వేశారు. టీడీపీ 23 సీట్లే గెలిచిందని ఎద్దేవా చేశారు. అందులో ‘న‌లుగురిని సంత‌లో ప‌శువుల్లా కొన్నావు. చివ‌రికి అదే 23న‌, అదే 23 ఓట్లతో నీ ఓట‌మి-మా గెలుపు. ఇది క‌దా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్.’ అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు.

కాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఘన విజయం సాధించింది. వైసీపీ ఎమ్మెల్యేలు సక్రమంగా ఓటు వేయడంలో సక్సెస్ అయిన అధిష్టానం టీడీపీ అభ్యర్థి ఓట్లు పడకుండా అడ్డుకోవడంలో విఫలమైంది. దీంతో పంచుమర్తి అనురాధ గెలుపు లాంఛనమైంది. పంచుమర్తి అనురాధ గెలుపునకు 22 ఓట్లు అవసరం కాగా 23 ఓట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఏడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 8 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఏడు స్థానాలను కైవసం చేసుకోవాలని వైసీపీ ప్రయత్నించినప్పటికీ అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పంచుమర్తి అనురాధతో నామినేషన్ వేయించారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. ఇకపోతే వెలగపూడి అసెంబ్లీ మీటింగ్ హాలులోజరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే.

Also Read...

YCP: టీడీపీ అభ్యర్థికి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎవరు..?

Advertisement

Next Story