- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం జగన్ కలియుగ భస్మాసురుడు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కలియుగ భస్మాసురుడు అని ఆయన అభివర్ణించారు. కుప్పంలో సభలో చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తే శ్రీకాకుళం ‘రా కదిలి రా’ సభలో జగన్‌కు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ పేదల ప్రతినిధి కాదని.. వారి రక్తం తాగే జలగ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో పేదలు నిరుపేదలయ్యారని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో సాగు నీటి ప్రాజెక్టులు నిర్వీర్యమయ్యాయని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టారని మండిపడ్డారు. భస్మాసురిడిలా ప్రజల నెత్తిన చేయిపెట్టారని విమర్శించారు. ఓటుతో కలియుగ భస్మాసురుడిని ఇంటికి పంపాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.
సీఎం జగన్ నాటకాల ముందు సురభి నాటకాలు కూడా సరిపోవని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తన నాటకాలతో ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషి కొండలో రూ. 500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నారని చెప్పారు. ఊరికో ప్యాలెస్ ఉన్న వ్యక్తి పేద వ్యక్తినని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రజల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి అధికారం అప్పగించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీకి సంపద సృష్టించడం తెలుసని చెప్పారు. జగన్ పాలనలో వైసీపీ నాయకులు ధనవంతులయ్యారని తెలిపారు. జగన్ మాత్రం ప్రజలకు రూ. 10 ఇచ్చి రూ. 100 దోచేశారని చంద్రబాబు ఆరోపించారు.
Read More..