సొంత బాబాయ్‌ను ఘోరంగా చంపారు.. సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-01-19 12:24:00.0  )
సొంత బాబాయ్‌ను ఘోరంగా చంపారు.. సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఆయనపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందారెడ్డి హత్య సంఘటనను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. కడప జిల్లా కమలాపురంలో ‘రా.. కదలిరా’ కార్యక్రమం సభలో పాల్గొన్న చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానందారెడ్డిని ఘోరం చంపారని ఆరోపించారు. సొంత బాబాయ్‌ను చంపి పలు కట్టు కథలు అల్లారని మండిపడ్డారు. ఏ తప్పు చేయని కోడి కొత్తి శ్రీనును జైల్లో ఉంచారని...కానీ హత్య చేసిన ఎంపీని మాత్రం బయటకు ఉంచారని ధ్వజమెత్తారు. చివరకు వివేకా కుమర్తె సునీత, సీబీఐపైనే కేసులు పెట్టారని వ్యాఖ్యానించారు. వివేకా హత్యపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. హంతకులను కాపాడుకునే వ్యక్తులకు ఓట్లు వేస్తారా అంటూ కడప జిల్లా ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు. సొంత జిల్లాలో కరువు విలయ తాండవం చేసినా జగన్ పట్టించుకోలేదని ఆరోపించారు. బాబాయ్ హత్యపై పులివెందుల ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారని తెలిపారు. చెత్తపై పన్ను వేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోయారని చంద్రబాబు విమర్శించారు.

Read More..

చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ వాయిదా వేసిన సుప్రీం..

ఇప్పటి దాకా అమెరికా.. ఇక నుంచి విజయవాడ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story