- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీడీపీ నేత దారుణహత్య: 9మందికి జీవిత ఖైదు
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ కార్యకర్త దారుణ హత్యకేసులో ఎట్టకేలకు నిందితులకు శిక్ష పడింది. ఈ కేసులో నిందితులైన 9మందికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఇకపోతే ప్రస్తుతం నిందితులు వైసీపీలో కొనసాగుతుండటం గమనార్హం. ఈకేసుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే 2006 సెప్టెంబర్‌లో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడులో వినాయక విగ్రహం ఊరేగింపు జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ వర్గీయులు టీడీపీ కార్యకర్త నరసింహయ్యపై రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ కేసుపై మచిలీపట్నం జిల్లా కోర్టులో ట్రయల్ నడిచింది. అనంతరం నందిగామలో జిల్లా అదనపు న్యాయమూర్తి కోర్టు రావడంతో కేసు విచారణ ఈకోర్టుకు బదిలీ అయ్యింది. మరోవైపు ఈ కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఇటీవలే స్టే ఎత్తివేసింది. దీంతో ఈ కేసుపై న్యాయమూర్తి ఇరువైపులా వాదనలు విన్నారు. నేరం రుజువు కావడంతో తుది తీర్పు వెల్లడించారు న్యాయమూర్తి . టీడీపీ కార్యకర్త నరసింహయ్య (80)పై దాడికి పాల్పడిన 9మందికి నందిగామ 16వ అదనపు న్యాయమూర్తి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు. ఇకపోతే యావజ్జీవ కారాగారశిక్ష పడినవారిలో పగడాల సుబ్బారావు, యండ్రాతి శ్రీనివాసరావు, నెల్లూరి నరసింహారావు, యండ్రాతి పూర్ణచంద్రరావు, రమణ, గూడపాటి పుల్లయ్య, ఈవూరి వసంతరెడ్డి, హనుమయ్య, గుత్తా నారాయణరావులు ఉన్నారు. అయితే ఈ నిందితులంతా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లు సమాచారం.