- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap News: ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: వైసీపీలో ఇంచార్జుల మార్పులపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ ఉందని, అందుకనే వైసీపీలో మార్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ సహా వైసీపీ నాయకులందరూ అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. ఇక నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకిస్తే మరో చోట ఆహ్వానిస్తారా అని ప్రశ్నించారు. చెల్లని రూపాయి ఏ నియోజకవర్గంలోనైనా పనికి రాదని అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని జగన్ ప్రభుత్వం ఉక్కుపాదంతో తొక్కేసిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత జగన్‌దేనని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే అసహించుకునే పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేని స్థితిని కల్పించాలన్నారు. అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లు అవుతున్నా రాష్ట్ర ప్రగతిపై ఏం సాధించారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి, సంక్షేమం కూడా సమానంగా కొనసాగించారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.