వంగవీటి రంగాను చంపింది టీడీపీయే: మంత్రి అంబటి రాంబాబు

by Seetharam |
వంగవీటి రంగాను చంపింది టీడీపీయే: మంత్రి అంబటి రాంబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీయే వంగవీటి మోహన రంగాను అత్యంత దారుణంగా హత్య చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు వంగవీటి మోహన రంగాను చంపింది నాటి టీడీపీ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. వంగవీటి రంగా హత్యకు టీడీపీయే కారణం కాబట్టి ప్రజలు టీడీపీని గద్దె దించి కాంగ్రెస్ పార్టీని నాడు అధికారంలోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరు నేతలు పార్టీలు మారడంతో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారని మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేశారు. నాడు తాను ఎమ్మెల్యేగా గెలుపొందాను కాబట్టే ఈ వ్యవవహారం తనకు తెలుసునన్నారు. సత్తెనపల్లి టీడీపీ ఇన్‌చార్జి కన్నా లక్ష్మీనారాయణ సైతంనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారని గతాన్ని గుర్తు చేశారు. ‘వంగవీటి రంగాను చంపింది టీడీపీయేనని కన్నా లక్ష్మీనారాయణ పలుమార్లు ఆరోపించారని గుర్తు చేశారు. వంగవీటి రంగాను చంపింది చంద్రబాబేనని డైరెక్‌గా ఆరోపణలు చేశారని మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేశారు. తాను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయం మెుదలు పెట్టానని.. వైఎస్ఆర్ మరణం అనంతరం వైఎస్ జగన్ వెంట నడిచినట్లు మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story