- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన 160 స్థానాల్లో గెలుపొందడం ఖాయం: సినీ నిర్మాత అశ్వినీదత్
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సినీ నిర్మాత అశ్వినీదత్ అన్నారు. 2024 ఎన్నికల్లో పొత్తులో ఎన్నికలకు వెళ్తే 160 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తును ప్రజలు స్వాగతిస్తున్నారని అశ్వనీదత్ తెలిపారు. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలను సినీనిర్మాత అశ్వినీదత్ కలిశారు. ఇద్దరినీ ఓదార్చారు. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడరని అన్నారు. ఈ కేసు నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వారితో అన్నారు. ఈ కష్టాలు కొన్నిరోజులు మాత్రమేనని మిగిలిన రోజులు అంతా మంచే జరుగుతుందని చెప్పుకొచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అశ్వినీదత్ సినీ రంగానికి చెందిన ప్రముఖులు చంద్రబాబు అరెస్ట్‌పై మాట్లాడకపోవడాన్ని పలువురు తప్పుబట్టడంపై అశ్వినీదత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ రంగం వాళ్లు మాట్లాడినంత మాత్రాన ఏమీ జరగదన్నారు. బయటకు వచ్చి సంఘీభావం ప్రకటించేవాళ్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. రాని వారిని వదిలేయాలని సూచించారు. రాజమహేంద్రవరం వచ్చి చంద్రబాబు కుటుంబాన్ని కలిసి సంఘీభావం ప్రకటించిన వాళ్లం ఉన్నాం కదా అని అశ్వినీదత్ తెలిపారు.