- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి గుంటూరు జిల్లాలో పొన్నూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ‘రా కదలి రా’ సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. అంతేకాదు.. ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన తప్పడం తనకు తెలియదని అన్నారు. జగన్‌లా అమలుకు సాధ్యం కాని హామీలు తాను ఎప్పటికీ ఇవ్వబోనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ఎప్పుడెప్పులు ఎన్నికలు వస్తాయా? అని ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్‌ను ఇంటికి పంపించేయాలని ఆత్రుతగా ఉన్నారన్నారు.
నాలుగేళ్లలో రాష్ట్రాన్ని జగన్ ఛిద్రం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా పాలించిన ఏకైక సీఎం దేశంలో జగన్ ఒక్కడే అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేయడం టీడీపీ-జనసేన కూటమితోనే సాధ్యమని చెప్పారు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయంగా తమవైపు చూస్తున్నారని తెలిపారు. జగన్ మరోసారి కోలుకోకుండా ప్రజలు ఈసారి తీర్పు ఇవ్వబోతున్నారని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కాతేరులో నిర్వహించిన రా..కదలి రా సభలో చంద్రబాబు స్టేజీ పైనుంచి కిందపడబోయారు. బొడ్డు వెంకట రమణ వర్గీయులు స్టేజీపై ఆందోళన చేశారు. అనంతరం స్టేజీపై చిన్నపాటి తోపులాట చోటుచేసుకుంది. చంద్రబాబుపై కార్యకర్తలు పడబోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను సేవ్ చేశారు.
Read More..
టీడీపీ సీనియర్ నేతపై దాడి చేసిన ఆంబోతుకి కళ్లెం వేస్తా..టీడీపీ అధినేత