ప్రజా జీవితంలోనూ పవన్ కల్యాణ్ హీరోనే: చంద్రబాబు

by Disha Web Desk 16 |
ప్రజా జీవితంలోనూ పవన్ కల్యాణ్ హీరోనే: చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజా జీవితంలోనూ పవన్ కల్యాణ్ హీరోనేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పెడనలో పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీలో ఎంపీగా ఉన్న తాను ఏమీ చేయలేకపోయాయని బాలశౌరి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. జనసేనలో చేరి స్వేచ్ఛగా ప్రజా సేవ చేయాలని బాలశౌరి కోరుకుంటున్నారని చెప్పారు. పెడన ప్రజలకు కాగిత వెంకట్రావు చాలా సేవలు చేశారని గుర్తు చేశారు. పొత్తులో భాగంగా కొనకళ్ల, వేదవ్యాస్‌కు సీట్లు ఇవ్వలేకపోయామన్నారు. వైసీపీ నేతలు దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారన్నారని చెప్పారు. ఆ కుట్రను జనసేన నేతలు అడ్డుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ పాలన ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడ్డారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారమని, సర్వేలన్నీ కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. పెడన ఎమ్మెల్యేకు ప్రజా సమస్యలు పట్టవని ఎద్దేవా చేశారు. గత ఎన్నికలకు ముందు కోడి కత్తి, గొడ్డలి డ్రామాలాడారని మండిపడ్డారు. ఇప్పుడు గులకరాయి డ్రామాలాడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story