Tdp Avirbhava Sabha: వైఎస్, కేసీఆర్‌ను అభినందించిన చంద్రబాబు

by srinivas |   ( Updated:2023-03-29 15:52:17.0  )
Tdp Avirbhava Sabha: వైఎస్, కేసీఆర్‌ను అభినందించిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్:వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, కేసీఆర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసించారు. టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భాంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సభ నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధిపై ఈ సభలో చంద్రబాబు మాట్లాడారు. తన హయాంలో హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని చెప్పారు. తన తర్వాత ముఖ్యమంత్రి అయిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా హైదరాబాద్‌లో అభివృద్ధిని కొనసాగించారని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కూడా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసిన వారికి తాను అభినందనలు చెబుతున్నానని చంద్రబాబు తెలిపారు. అటు ఏపీలోనూ అమరావతిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించామని.. తన తర్వాత వచ్చిన జగన్ మాత్రం విధ్వంసం సృష్టిస్తు్న్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Also Read..

ఏపీలో విధ్వంసం సృష్టించడానికే జగన్ పుట్టారు: సీఎంపై చంద్రబాబు ఫైర్

Advertisement

Next Story