- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్యకు పయనమైన టీడీపీ, జనసేన అధినేతలు..
దిశ వెబ్ డెస్క్: జనవరి 22 వ తేదీ అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనున్న విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో ప్రముఖులకు అయోధ్య రాముని ప్రాణప్రతిష్టకు రావాల్సిందిగా ఆహ్వానాలు కూడా అందాయి. కాగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కూడా అయోధ్య రాముని ఆహ్వానం అందిన విషయం అందరికి సుపరిచితమే.
ఈ నేపథ్యంలో రేపు జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం ఇరు పార్టీల అధినేతలు అయోధ్యకు బయలుదేరుతారు. ఈ రోజు రాత్రికి అయోధ్య లోనే బస చేస్తారు.
మరుసటి రోజు అనగా సోమవారం అయోధ్యలో జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి హాజరవుతారు. కాగా టీడీపీ, జనసేన ఇరు పార్టీల అధినేతలు ఈ మహోత్సవానికి హాజరవుతున్న నేపథ్యంలో బీజేపీతో టీడీపీ పొత్తు కలుపుకుంటుందనే ప్రచారానికి బలం చేకూరుతుందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.