- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News: కన్నీరు పెట్టుకున్న తానేటి వనిత..ఎందుకంటే..
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా అడుగులేస్తున్న వైసీపీ అధిష్టానం ఇంఛార్జుల నియామకంలో మార్పులు చేర్పుల కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనితను వైసీపీ అధిష్టానం రానున్న ఎన్నికల్లో గోపాలపురం వైసీపీ ఇంఛార్జిగా నియమించారు. అలానే కొవ్వూరు నియోజకవర్గం ఇంఛార్జిగా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును నియమించారు.
ఈ సందర్భంగా నిన్న కొవ్వూరులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న తానేటి వనిత భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. తనకు కొవ్వూరు నియోజకవర్గం వదిలి వెళ్లటం చాల బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా హోంమంత్రి తానేటి వనితను వేరే నియోజకవర్గానికి బదీలీచేయడం పై అసంతృప్తికి లోనైన కొందరు నాయకులు తమ పదవులకు రాజీనామా చేసి ఆ పత్రాలను హోంమంత్రికి అందచేశారు.
ఈ నేపథ్యంలో హోంమంత్రి తానేటి వనిత వాళ్లకు నచ్చ చెప్పి రాజీనామాలను నిలిపివేశారు. ఇక తనను ఆదరించినట్లుగానే ప్రస్తుతం వైసీపీ అధిష్టానం కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా నియమించిన మ్మెల్యే తలారి వెంకట్రావును కూడా ఆదరించి.. రానున్న ఎన్నికల్లో ఆయన గెలుపుకు తోడ్పడాలని నియోజకవర్గ నాయకులకు పిలుపునిచ్చారు హోంమంత్రి తానేటి వనిత.