ఓటర్ల జాబితా అక్రమాలపై చర్యలు తీసుకోండి: గల్లా జయదేవ్

by Seetharam |
ఓటర్ల జాబితా అక్రమాలపై చర్యలు తీసుకోండి: గల్లా జయదేవ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాలపై చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో ఓటర్ల జాబితా అక్రమాలపై ప్రస్తవించారు. దొంగ ఓట్ల వ్యవహారంపై పార్లమెంటులో గళం విప్పారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, విధివిధానాల బిల్లుపై చర్చలో గల్లా జయదేవ్ మాట్లాడారు. రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఎక్కడా అమలు కావట్లేదని సభలో ప్రస్తావించారు. ఈసీ ఆదేశాలు డీఆర్వోలు, స్థానిక సిబ్బంది పరిగణనలోకి తీసుకోవట్లేదని ఆరోపించారు. ఒత్తిళ్లకు లొంగి వారికి అనుకూలంగా జాబితాలో మార్పులు చేస్తున్నారన్నారు. పారదర్శక ఓటర్ల జాబితాకు చర్యలు చేపట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎంపీ గల్లా జయదేవ్ కోరారు.

Advertisement

Next Story