- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తాడేపల్లిగూడెంలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన ఈలి నాని
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: తాడేపల్లిగూడెం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈలి నాని ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పొత్తులో భాగంగా ఈ నియోజకరవర్గం సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన మనస్థాపం చెందారు. గతంలోనే పార్టీ మారాలని యోచించిన ఆయన త్వరలో ఎన్నికలు వస్తుండటంతో సీటు వస్తుందని ఆశించారు. అయితే ఆయనకు భంగపాటు తప్పలేదు. దీంతో ఈలి నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేస్తానని ఈలి నాని స్పష్టం చేశారు.
కాగా 2009లో ఈలి నాని ప్రజా రాజ్యం తరపున తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం టీడీపీలో పని చేశారు. అప్పటి నుంచి టీడీపీ ఇంచార్జిగా పని చేశారు. తాజాగా ఆ పార్టీని వీడారు.
Next Story