వైసీపీ పరిపాలనలోని ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంలో విచారణ

by Bhoopathi Nagaiah |
వైసీపీ పరిపాలనలోని ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంలో విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై తాజా నివేదికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర అటవీశాఖ, పర్యావరణ శాఖలు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాయి. కోర్టులో ముగిసిన వాదనల అనంతరం విచారణను ఆగస్టు 30 వ తేదీకి వాయిదా వేసింది.

ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటికే 8 జిల్లాల్లో తనిఖీలు నిర్వహించినట్లు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలు సంబంధిత వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించాయి. తనిఖీల్లో వెల్లడైన విషయాలను కోర్టుకు సమర్పించినట్టు అదనపు సోలిసిటర్ జనరల్ తెలిపారు. ఈ అంశానికి చెందిన అన్ని వ్యవహారాలను ముందుండి నడిపిన జేపీ వెంచర్స్ అనే సంస్థను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed