AP News:‘విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి’.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక సూచనలు

by Jakkula Mamatha |
AP News:‘విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి’..  మంత్రి కొల్లు రవీంద్ర కీలక సూచనలు
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా టీచర్స్&పేరెంట్స్ మీటింగ్ నిర్వహించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నేడు(శనివారం) మచిలీపట్నం నియోజకవర్గం రుస్తుంబాదలోని నగరపాలక బాలికల పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల జీవితాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం. అలాంటిది ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటే మరింత మెరుగైన జీవితం అందించొచ్చనే సంకల్పంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. రాష్ట్రంలో 18 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు.

ప్రైవేటు స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం అన్నారు. డాక్టర్ చేయాలని నా తల్లి తపించినా సాకారం కాలేదు అని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. పేదలు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో నందమూరి తారక రామారావు స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి శ్రీకారం చుట్టారు. ఇంటర్మీడియట్ పిల్లలకు గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనం నిలిపివేస్తే.. తిరిగి దాన్ని పునరుద్దరించాం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా.. తెలుగు వారి సత్తా ఏంటో కనిపిస్తుంది. ఒకప్పుడు ఐటీకి చంద్రబాబు గారు వేసిన పునాదులే.. నేటి ఏపీ, తెలంగాణలో ఇంత మంది ఐటీ ఉద్యోగులకు కారణం అన్నారు. తొలిసారిగా మహిళలకు యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు.

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచనలు చేశారు. ‘నా స్కూల్, నా టీచర్స్ కు మంచి పేరు తెచ్చేందుకు కట్టుబడి ఉంటానని’ ప్రతిజ్ఞ పూని ముందుకు వెళ్లాలి అన్నారు. పుట్టిన ఈ గడ్డకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో అడుగులు వేసినప్పుడు మన జీవితానికి సార్ధకత లభిస్తుంది. మచిలీపట్నం అంటే విద్య రంగానికి అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. మళ్లీ పూర్వ వైభవం కల్పించేలా మచిలీపట్నంలో గ్లోబల్ కేపబుల్ కేంద్రం కావాలని కోరాను. త్వరలోనే నేషనల్ కాలేజీలో ఇన్నోవేషన్ కేంద్రంగా మచిలీపట్నం మారుస్తాం. పాలిటెక్నిక్ కాలేజీకి శాశ్వత భవనం నిర్మించబోతున్నాం. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు అన్ని రకాలుగా సహకారం అందించబోతున్నాం. జనవరి 2, 3 తేదీల్లో మచిలీపట్నం కేంద్రంగా యువ కెరటాలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. విద్యార్థులు కూడా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ముందుకు రావాలి.

మొబైల్ వినియోగానికి విద్యార్థులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అదే సమయంలో స్కూళ్లు, కాలేజీల్లో కూడా గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరిగింది. వాటిని నియంత్రించేందుకు ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. గంజాయి, డ్రగ్స్ లాంటి వాటిపై డేగ కన్ను వేస్తున్నాం అన్నారు. స్కూళ్ల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కూడా ముందుకు వస్తుండడం అభినందనీయం. వారి సేవలను కూడా సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలి. గత విద్యా సంవత్సరంలో 98 శాతం పాస్ రేట్ రావడం సంతోషంగా ఉంది. అయితే.. అంతటితో ఆగిపోకూడదు. 100 శాతం పాస్ రేట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి సహకారం కావాలని అండగా నిలిచేందుకు తోడుగా ఉంటానని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, జనసేన ఇంఛార్జి బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed