బిగ్ బ్రేకింగ్: పోలీసులపై జనసేన కార్యకర్తల రాళ్ల దాడి.. సీఐ తలకు గాయం!

by Satheesh |
బిగ్ బ్రేకింగ్: పోలీసులపై జనసేన కార్యకర్తల రాళ్ల దాడి.. సీఐ తలకు గాయం!
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలం చిందేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.జనసేన నేత వినూత చేపట్టిన దీక్ష భగ్నం చేసేందుకు పోలీసులు వెళ్లారు. దీంతో పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన జనసేన కార్యకర్తలు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసుల తలలు పగిలాయి. సీఐ ఆరోపణరావు, ఏఎస్సై సాగర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాయపడ్డవారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story