చంద్రబాబుపై రాళ్ల దాడి : టీడీపీ సంచలన నిర్ణయం

by Sathputhe Rajesh |
చంద్రబాబుపై రాళ్ల దాడి : టీడీపీ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం చంద్రబాబు టార్గెట్ గా వైసీపీ చేసిన రాళ్ల దాడిని టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ముఖ్య నేతలతో చంద్రబాబు శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాళ్లదాడి ఘటన పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటకే ఘటన వివరాలను ఈ - మెయిల్ ద్వారా రాజ్ భవన్‌కు టీడీపీ పంపింది. అయితే ఈ ఘటనపై కేంద్రానికి సైతం ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై జరిపిన దాడులను కంప్లైంట్ లో ప్రస్తావించాలని భావిస్తోంది.

Advertisement

Next Story