- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఆపై తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లిఖార్జునరావు రచించిన స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు పుస్తకాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి ఆర్ కె రోజా, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషాశ్రీచరణ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, సాంస్కృతిక పర్యాటకశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు.