- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్ని వర్గాల వారి అభ్యున్నతికి టీడీపీ కృషి చేస్తుంది:గొండు శంకర్
దిశ ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు అన్ని వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నది టీడీపీ అని నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు గొండు శంకర్ అన్నారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళం లోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రన్న సంక్రాంతి కానుకలు, ముస్లింలకు రంజాన్ తోఫా, క్రైస్తవులకు ఎలా అందరికీ ఆయా సందర్భాలను బట్టి అన్ని పంచిపెట్టే వారాన్నారు.
టీడీపీ బీజేపీ తో పొత్తు కావడం వల్ల మైనార్టీ సోదరులకు నష్టం అవుతుందని కొంతమంది తప్పుడు ప్రచారంతో బీజేపీలో చేరడం వల్ల హిందూ ధర్మం తప్ప వేరే కులాలకు వేరే మతాలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారని అది తప్పుడు ప్రచారమని ఈ సందర్భంగా ఖండించారు.టీడీపీ ఎప్పుడు కూడా బడుగు బలహీన మైనార్టీలకు అండగా ఉంటుందని తెలియజేశారు.ఈ విషయాన్ని అందరూ గుర్తించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకురావాలని ప్రజలను కోరారు. జామియా మసీదు, సాధిఖాన్ ను పునరుద్ధరణను తాను చేపడతానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ముస్లిం పెద్దలు జామియా మసీదు ఇమామ్, ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ వహాబ్ , మసీద్ మీనా మసీద్ ఇమామ్ ఎండి. జలాలుద్దీన్, ఇలిసిపురం మసీద్ ఇమామ్ అబ్దుల్ అజీజ్, వివిధ మసీదుల ఇమాములు, నగరానికి చెందిన ముస్లిం మత పెద్దలు , తదితరులు పాల్గొన్నారు.