Srikakulam: తల్లిదండ్రుల ఔదార్యం.. కుమారుడి గుండె దానం

by srinivas |
Srikakulam: తల్లిదండ్రుల ఔదార్యం.. కుమారుడి గుండె దానం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్‌ సెంటర్‌ హాస్పిటల్‌లో అరుదైన గుండె మార్పిడి ఆపరేషన్‌ జరిగింది. తిరుపతిలో ఒకరికి గుండె అవసరమైంది. ఈ తరుణంలో శ్రీకాకుళం జిల్లా వాసి విద్యార్థి కిరణ్ చంద్ బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందారు. ఈ విషాదంలోనూ తల్లిదండ్రులు గొప్ప మనసుకున్నారు. కొడుకు మరో రూపంలో బ్రతికే ఉండాలనే ఆలోచనతో అవయవదానానికి ఒప్పుకున్నారు. దీంతో విద్యార్థి గుండెను తిరుపతికి తరలించేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం నుంచి వైజాగ్‌కి గుండె తరలించారు. వైజాగ్ నుంచి ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు. రేణిగుంట నుంచి గ్రీన్ ఛానెల్ ద్వారా తిరుపతి ఆస్పత్రికి ఆ గుండెని తరలించారు.

Advertisement

Next Story

Most Viewed