- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Vijayawada To Gudur: ఈ నెల 27 నుంచి పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు
Vijayawada To Gudur: ఈ నెల 27 నుంచి పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు

X
దిశ, గూడూరు: విజయవాడ-గూడూరు మూడవ రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 27వ తేదీ నుండి మార్చి 3 వరకు పలు ప్యాసింజర్ మెమోరైళ్లను రద్దు చేయడం జరిగిందని గూడూరు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు. గూడూరు రైల్వే స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ- గూడూరు మూడవ రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా ప్రతిరోజు ఉదయం బిట్రగుంట నుంచి చెన్నై వెళ్లే ప్యాసింజర్ రైలు రద్దు చేసినట్లు తెలిపారు. గూడూరు నుంచి ఉదయం విజయవాడ వెళ్లే ప్యాసింజర్ రైలును కూడా రద్దు చేశామన్నారు. ఉదయం, సాయంత్రం చెన్నై నుంచి నెల్లూరుకు వెళ్లే మెమో రైలు గూడూరు వరకే నడుస్తుందని, ప్రయాణికులు గమనించాలని గూడూరు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు కోరారు.
Next Story