- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి అవినీతి చిట్టా బయట పెడతా!
దిశ, నెల్లూరు: ఉదయగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అవినీతి చిట్టా మొత్తం తన దగ్గర ఉందని.. దాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తానని వైసీపీ ఉదయగిరి పరిశీలకులు ధనుంజయ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో కొన్ని రోజులు అబ్జర్వర్‌గా పని చేసే అవకాశం సీఎం జగన్ కల్పించారని, ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ధనుంజయ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో వైసీపీ బలంగా ఉందన్నారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలకు వివరణ ఇచ్చే దానికే ఇక్కడకు వచ్చామని జగన్ ఆదేశాలు మేరకు రాష్ట్ర లో 175 నియోజక వర్గాల్లో పార్టీ బలోపేతం కోసం ఎన్నికల్లో విజయం కోసం అబ్జర్వర్‌లుగా నియమించారని తెలిపారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, జగన్ ప్రభంజనంతోనే చంద్ర శేఖర్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్న విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు.