TDP: గ్రాఫ్ భయంతోనే పిచ్చి ప్రేలాపన..!

by srinivas |
TDP: గ్రాఫ్ భయంతోనే పిచ్చి ప్రేలాపన..!
X

దిశ, నెల్లూరు: గ్రాఫ్ పడిపోతుందనే భయంతోనే మంత్రి కాకాణి పిచ్చి ప్రేలాపనతో టీడీపీలో చేరికలను ఓర్చుకోలేకపోతున్నారని టీడీపీ నేత శ్రీనివాసులు మండిపడ్డారు. వెంకటాచలంలో ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. తాము టీడీపీలో చేరడాన్ని కాకాణి ఓర్చుకోలేక అరాచకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాసులు ఆదివారం వెంకటాచలంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతల అరాచకాలు, అక్రమాలతో ప్రజలు విసిగివేసారిపోయారని ఆరోపించారు. రోజురోజుకూ గ్రాఫ్ పడిపోతుండటంతో తన చెంచాలతో నోటికొచ్చినట్టు కాకాణి మాట్లాడిస్తు్న్నాడని విమర్శించారు. టీడీపీ నేత సోమిరెడ్డి దగ్గర టిప్పులు తీసుకుని బతికినోళ్లు కూడా ఆయనపై సవాళ్లు విసరడం హాస్యాస్పదంగా ఉందని శ్రీనివాసులు విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed