- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Nara lokesh: మ్యాటర్ వీక్...పబ్లిసిటీ పీక్.. సీఎం జగన్ పాలనపై సెటైర్స్
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ పాలనలో మ్యాటర్ వీక్...పబ్లిసిటీ పీక్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. గూడూరు నియోజకవర్గం తాడిమేడు మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన ఫిష్ ఆంధ్రా అని హడావిడి చేసిన సీఎం జగన్ ఫినిష్ ఆంధ్రా చేశాడని మండిపడ్డారు. మత్స్యకారుల పొట్ట కొడుతూ జగన్ తెచ్చిన జీఓ.217 ను టిడిపి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రద్దు చేస్తామన్నారు. పులికాట్ సరస్సు సమస్య పై తనకు పూర్తి అవగాహన ఉందని, తమిళనాడు జాలర్లు దాడులు చేస్తుంటే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారులను సూళ్లూరుపేట ఎమ్మెల్యే కుక్కలతో పోల్చి తిడితే జగన్ కనీసం మందలించే పరిస్థితి లేదన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తీస్తామన్నారు. ఛానల్ కాలువల్లో పూడిక తీసి బోటు ద్వారా రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రైయింగ్ ప్లాట్ ఫామ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తమిళనాడు సిఎంతో చర్చలు జరిపి జాలర్ల సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు.
‘‘ఇతర రాష్ట్రాల వారు ఇటు వేటకి రాకుండా నియంత్రిస్తాం. తమిళనాడు స్టిమర్లు ఇక్కడికి రాకుండా చర్యలు తీసుకుంటాం.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఏపీ ప్రయాణం మొదలు అయ్యింది. అయినా ఏ వర్గానికి లోటు లేకుండా అందరికీ న్యాయం చేశారు చంద్రబాబు. టిడిపి హయాంలో ఏపిని మత్స్యకారప్రదేశ్‌గా మార్చాం. ఆక్వా ఎగుమతుల్లో చంద్రబాబు ఏపీని నంబర్ 1గా చేశారు. మత్స్యకారుల కోసం తీర ప్రాంతంలో తుఫాను షెల్టర్లు ఏర్పాటు చేస్తాం. ఆదరణ పథకం ద్వారా మత్స్యకారులకు అవసరం అయిన అన్ని పనిముట్లు అందజేస్తాం.’’ అని లోకేశ్ హామీ ఇచ్చారు.