- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KotamReddy: నన్ను కుంటోడిని చేశావ్.. అనిల్ నిన్ను వదలను!
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ అంతటి దరిద్రపు ఎమ్మెల్యే మరోకరు లేరని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. జిల్లాలోనే మగాడిని తానే అంటున్న అనిల్ కుమార్ యాదవ్ రాజమాత ఎవరు అంటే పారిపోతాడెందుకు అని ఆయన నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులో టీడీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేసిన 50 వేల మెజారిటీతో అనిల్ కుమార్ యాదవ్‌పై గెలుపొందుతారని జోస్యం చెప్పారు. రాజమాత అన్నావ్ మళ్లీ మహారాణి అన్నావ్.. దమ్ముంటే వారు ఎవరో బయట పెట్టు అని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సవాల్ చేశారు. రాజమాత ఎవరో చెప్పలేక అనిల్ పారిపోయి ప్యాంటు తడుపుకున్నాడని ధ్వజమెత్తారు. తనను కుంటివాడిని చేసింది ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అని, ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
‘నువ్వు నన్ను కార్‌తో తొక్కిస్తే నేను నిన్ను రోడ్డు రోలర్‌తో తొక్కించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అని అనిల్ కుమార్‌కు శ్రీనివాసులు రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అనిల్ చేసిన దోపిడీ, అవినీతి పై తాను చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. అనిల్ మగాడైతే టైమ్, ప్లేస్ చెప్పాలని అని ఛాలెంజ్ చేశారు. ఉన్నత చదువులు చదివి సిగ్గు లేకుండా పవిత్ర శాసనసభలో జిప్పు విప్పిన ఎమ్మెల్యే అని మండిపడ్డారు. ఓటమితో అనిత్ చరిత్ర నెల్లూరులో ఇక ముగిసిపోవడం ఖాయం అని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి జోస్యం చెప్పారు.
ఇవి కూడా చదవండి : Pawan Kalyan: అందరూ ఇలా తెల్ల గెడ్డంతో పుట్టరు కదా?