- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nellore: విక్రమ సింహపురి యూనివర్సిటీలో పోస్టర్ల కలకలం
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీలో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. ఈ పోస్టర్లలో ఆర్వో వాటర్ ప్లాంట్లను, కూలింగ్ ఫ్రీజ్‌లను రిపేర్ చేయించాలని లేకపోతే న్యాక్ బృందం పర్యటనను అడ్డుకుంటామంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లను ఏబీవీపీ నాయకులు అంటించారు. పది రోజుల క్రితమే ఏబీవీపీ నాయకులు ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రిజిస్ట్రార్‌కి వినతిపత్రం అందించారు. ఆర్‌వో వాటర్ ప్లాంట్లను రిపేరు చేస్తే నెలకు 1,50,000 రూపాయిలు ఖర్చు చేసే వాటర్ క్యాన్ లను కొనాల్సిన అవసరం లేదని ఆ పోస్టర్లలో తెలిపారు. దీంతో విద్యార్ధులకు మెస్ చార్జీలు తగ్గుతాయని ఆ పోస్టర్లలో వివరించారు. విక్రమ సింహపురి విశ్వ విద్యాలయంలోని శుద్ధి జలాల ప్లాంట్లు, కూలింగ్ ఫ్రిజ్లను మరమ్మతులు చేయించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని.. లేకుంటే న్యాక్ బృందం పర్యటనను అడ్డుకుంటామంటూ ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు.