- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nellore: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
దిశ, నెల్లూరు రూరల్: ఎన్నో సంవత్సరాలుగా మున్సిపల్ ఆఫీసులో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నగరంలోని 10,11,13,14,15,16 డివిజన్లలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు ఏసీ నగర్‌లోని ఏసీ స్తూపం వద్ద నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీను అమలు చేయాలన్నారు. కార్మికులకు రావాల్సిన హెల్త్ అలవెన్స్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కార్మికులకు నాలుగేళ్లుగా సబ్బులు, చెప్పులు, గ్లౌజులు, ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కార్మికులకు ఇప్పటివరకు ఎక్స్ గ్రేషియా చెల్లించలేదన్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ జీతాల్లో కట్ అవుతున్నా కార్మికులు రావాల్సిన బెనిఫిట్స్ ఏవీ రావడం లేదని అన్నారు. చట్ట ప్రకారంగా కార్మికులకు ఇవ్వాల్సిన సెలవులు కూడా అమలు కావడం లేదని కత్తి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.