- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nellore: మేయర్‌పై భగ్గుమన్న వైసీపీ కార్పొరేటర్లు...ఉద్రిక్తత
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు మున్సిపల్ సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమావేశం కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు సీఎం జగన్ ఫొటో పెట్టారు. దీంతో మేయర్ స్రవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా జగన్ ఫొటో ఎవరు పెట్టారని ప్రశ్నించారు. దీంతో మేయర్‌పై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వర్గం కార్పొరేటర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అజెండా పేపర్లు చించేశారు. మేయర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేయర్‌గా కొనసాగే అర్హత లేదని నినాదాలు చేశారు. స్రవంతికి మేయర్ పదవి ఇచ్చిన సీఎంను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు మేయర్‌కు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వర్గం కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. మేయర్ శ్రీధర్ రెడ్డి వర్గంలోని కార్పొటర్ కావడంతో పాలక సంస్థ సమావేశాల్లో వైసీపీ కార్పొరేటర్లు గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అయితే రాజకీయ కుట్రతోనే కొందరు కార్పొరేటర్లు తనను టార్గెట్ చేశారని మేయర్ స్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.