Heat Politics: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే .. కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం

by srinivas |
Heat Politics: టీడీపీలోకి  వైసీపీ ఎమ్మెల్యే .. కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం
X
  • ఆనం టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారా?
  • ప్లాన్ ప్రకారమే టీడీపీలోకి కూతురు
  • ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వంపై విమర్శలు చేశారని టాక్

దిశ, నెల్లూరు: దశాబ్ధాల పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకియాల్లో ఆనం కుటుంబం కీలకపాత్ర పోషించింది. నేటికి ఆ కుటుంబానికి అదే స్థాయిలో ప్రధాన్యత ఉంది. జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఆనం అనుచరులు బలంగానే ఉన్నారు. అయితే ఆనం రామనారాయణ రెడ్డి కొంత కాలంగా వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారు. బహిరంగంగానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూస్తున్నారు. అయితే వెంకటగిరి నిజయోజకవర్గం ఇంచార్జిని మారుస్తూ ఆనంకు వైసీపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ఆ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జిగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమించింది. ఇంచార్జిగానే కాకుండా వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఆయనకే కేటాయిస్తారన్న టాక్ కూడా జోరుగా సాగుతుంది. ప్రస్తుతం వెంకటగిరికి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న సందిగ్థం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆనం టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్న పుకార్లు షికార్లు కొడుతున్నాయి.


జగన్ పొమ్మన లేక పొగపెట్టారా?

వైసీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం తరువాతే ఆనం స్వపక్షంలో విపక్ష నేతగా ఆయన వ్యవహారం సాగింది. ప్రభుత్వంపై ఆనం బహిరంగంగానే విమర్శలు చేస్తూ ప్రకంపనలు సృష్టించారు. అయిన జగన్ ఆనం విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొద్ది రోజులుగా ఆనం ప్రభుత్వంపై విమర్శలు తారాస్థాయికి చేరాయి. పింఛన్లు ఇచ్చినంత మాత్రన మనం గెలవలేమని, గత ప్రభుత్వాలు కూడా పింఛన్లు ఇచ్చాయని బహిరంగంగానే మాట్లాడారు. ముందస్తు ఎన్నికలు వస్తే సంవత్సరం ముందుగానే ఇంటికి వెళ్లాల్సి వస్తుందని సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేసి రచ్చకెక్కారు. దీంతో జగన్ చర్యలకు ఉపక్రమించి వెంకటగిరి ఇంచార్చి బాధ్యతల నుంచి తప్పించారు. జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ఆనంకు ఈ నిర్ణయం అవమాన కరమేనని అందుకే పార్టీ మారే యోచనలో ఉన్నారని తెలిసింది..

పార్టీ మారాలన్న ఉద్దేశంతోనే ఆనం ఆ వ్యాఖ్యలు చేశారా?

వైసీపీ అధిష్టానం ఉందు నుంచే ఆనం రామనారాయణ రెడ్డి పక్కన పెట్టింది. ఆయన రాజకీయ అనుభవానికి తగ్గట్టుగా పార్టీలో తనకి ప్రాధాన్యత లభించలేదు. రెండుసార్లు జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కూడా ఆయనకు మంత్రి పదవి కట్టపెట్టలేదు. దీంతో అసంతృప్తికి లోనైన ఆనం అప్పటి నుంచి తీవ్రంగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక లాభం లేదని గ్రహించిన ఆనం ముందుగా కూతురుని టీడీపీలోకి పంపి ఇక ఎన్నికలు సమీపిస్తున్న సమయానికి ప్లాన్ ప్రకారమే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసి వారే సాగనంపేలా చేయించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తర్వరలోనే టీడీపీలోకి వళ్లడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఆనం పార్టీ మారితే టీడీపీ ఆహ్వానించి కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.

Advertisement

Next Story

Most Viewed