Ap News: ఎమ్మెల్యేకి చెప్పినా పట్టించుకోలేదా...?

by srinivas |
Ap News: ఎమ్మెల్యేకి చెప్పినా పట్టించుకోలేదా...?
X

దిశ, గూడూరు: చిల్లకూరు మండలం నల్లయ్యగారిపాలెంలో 25 రోజులుగా తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాగునీరు సరఫరా చేసే మోటర్‌ను రిపేర్ కావడంతో అధికారులకు, నాయకులు చెప్పారు. అయినా వారు పట్టించుకోలేదు. దీంతో నీళ్లు లేక అవస్థతలు పడుతున్నట్లు గ్రామస్తులు వాపోయారు. అటు గ్రామ సర్పంచి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడంలేదని, ఎమ్మెల్యే దృషికి తీసుకు వెళ్లినా అక్కడ నుంచి కూడా ఎలాంటి స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక కాలువలు, చెరువుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామన్నారు. ఆ నీటిని తాగడంతో చర్మవ్యాధులు ఎక్కువవుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు తాగునీరు మోటర్‌ను రిపేర్ చేసి మంచి నీటిని సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story