- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KotamReddy: జులై 2న నెల్లూరు రూరల్‌పైనే అందరి చూపు
దిశ, నెల్లూరు జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర జులై 2వ తేదీ మధ్యాహ్నం నెల్లూరు రూరల్ పరిధి కాకుపల్లికి చేరుతుందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల చూపు మొత్తం నెల్లూరు రూరల్‌పైనే కేంద్రీకృతమైందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు మాగుంట లేఔట్‌లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 18 గ్రామ పంచాయతీ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో యువగళం పాదయాత్రను ‘న భూతో న భవిష్యతి’ అనే విధంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చర్చించుకునే విధంగా ఈ యాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ మరింత పెరిగిందని, సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లో టీడీపీ విజయభేరి ఖాయమన్నారు.
టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరు సమిష్టిగా పని చేస్తేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామన్నారు. కాకుపల్లి గ్రామం నుంచి అనిల్ గార్డెన్స్ వరకు పాదయాత్ర సాగుతుందని ఈ సందర్భంగా వివిధ కళాజాతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
టీడీపీ జిల్లా నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్‌లో జరిగే లోకేశ్ పాదయాత్రను రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చర్చించుకునే విధంగా ఉండాలని, ఆ స్థాయిలో ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలన్నారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.