Sridhar Reddy: ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీదే అధికారం

by srinivas |   ( Updated:2023-07-18 15:42:12.0  )
Sridhar Reddy: ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీదే అధికారం
X

దిశ, నెల్లూరు జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 19 , 20 డివిజన్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన డివిజన్ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు వైపు చూస్తున్నారని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బూత్ స్థాయిలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తున్నట్లు శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.

టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడే కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. తమను నమ్ముకుని పని చేస్తున్న నేతలు, కార్యకర్తలు సమిష్టిగా సమన్వయంతో పని చేయాలని గిరిధర్ రెడ్డి సూచించారు.

Advertisement

Next Story