- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Minister Kakani: ఆ నలుగురుని వేలివేశాం..
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి రాజకీయ సంక్షోభం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన రెబల్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీలో గెలిచి.. టీడీపీకి ఓటు వేయడం నైతికత కాదన్నారు. తప్పు ఎవరు చేసినా.. శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్యానించారు. టీడీపీకి ఓటు వేసిన నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. తప్పు చేశారు కాబట్టే వెలివేశామని అన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని నిర్ధారించి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని...ఇది వింత కాదు..విడ్డూరం కానేకాదన్నారు. పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని కాకాణి గోవర్థన్ రెడ్డి హెచ్చరించారు.