Nellore: కాలేజీలో ర్యాగింగ్.. మనస్థాపంతో విద్యార్థి ఆత్మహత్య

by srinivas |
Nellore: కాలేజీలో ర్యాగింగ్.. మనస్థాపంతో విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో : జీవితంలో ఇంజినీర్‌గా స్థిరపడాలనుకున్నాడు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనుకున్నాడు. ఇలా ఎన్నో ఆశలతో కాలేజీలోకి అడుగుపెట్టిన ఆ విద్యార్థి ర్యాగింగ్ భూతానికి బలైపోయాడు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. కడనూతల ఆర్ఎశ్ఆర్ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో అనంతసాగర్ మండలం శంకర్‌నగర్‌‌కు చెందిన ప్రదీప్ అనే విద్యార్థి విద్యనభ్యసిస్తున్నాడు. అయితే ప్రదీప్‌ను రూమ్ మేట్స్‌తోపాటు మరికొందరు ర్యాగింగ్ చేస్తూ నిత్యం వేధించేవారు. ఈ ర్యాగింగ్ రోజు రోజుకు శృతిమించింది. ఆ ర్యాగింగ్ మానసికంగా ఇబ్బందులకు గురి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో కావలి రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తన రూమ్ మేట్స్ ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారని, తమ కుమారుడు తమకు ఫోన్ చేసి చెప్పాడని తెలిపారు. బీర్లు, బిర్యానీలు కావాలని డిమాండ్ చేసేవారని..డబ్బుల్లేవంటే ఫోన్ తీసుకుని దౌర్జన్యం చేస్తు్న్నారని వాపోయినట్లు వారు తెలిపారు. కళాశాల యాజమాన్యంతో తాము మాట్లాడతామని చెప్పామని, అయితే ఇంకా ర్యాగింగ్ ఎక్కువ అవుతుందని వాపోయాడన్నారు. టీసీ ఇచ్చేయాలని కూడా మేనేజ్‌మెంట్‌ను తమ కుమారుడు అడిగినా పట్టించుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడు మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed