Nellore: 300 మంది గిరిజన కుటుంబాలకు బిర్యానీ పంపిణీ

by srinivas |
Nellore: 300 మంది గిరిజన కుటుంబాలకు బిర్యానీ పంపిణీ
X

దిశ, నెల్లూరు జిల్లా కావలి: కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జనం మెచ్చిన నాయకుడిగా ముద్రపడ్డారని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈతముక్కల బాలమురళి రెడ్డి అన్నారు. కావలి బుడంగుంట గిరిజన కాలనీ, తాళ్లపాలెం రూరల్ హెల్త్ సెంటర్‌లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మంది గిరిజన కుటుంబాలకు బిర్యానీ పంపిణీ చేశారు. అనంతరం బట్టలు కూడా పంపిణీ చేశారు. తాళ్ళపాలెం హెల్త్ సెంటర్‌కు 6నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బట్టలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బాలమురళి రెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం తపనపడే నాయకుడు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని అన్నారు. 2024లో మంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

Next Story