- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు మహిళలు దుర్మరణం
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండారెడ్డిపాలెం(Kondareddypalem) వద్ద అదుపు తప్పి కారు బోల్తా(Car Overturned) పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు సామ్రాజ్యం, సులోచనగా గుర్తించారు. ఈ ఘటనతో రోడ్డుపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గురైన కారును జేసీబీ సాయంతో పక్కకు తీశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు. రోడ్డు రూల్స్ కచ్చితంగా పాటించాలన్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.