- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చంద్రబాబు కన్నీళ్లు పెట్టిన రోజు నుండే YCP పతనం స్టార్ట్: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేతలు అవమానించడంతో టీడీపీ చీఫ్ చంద్రబాబు కన్నీళ్లు పెట్టిన రోజు నుండే ఆ పార్టీ పతనం స్టార్ట్ అయ్యిందని.. అందుకే ప్రజలు వైసీపీకి 11 స్థానాలు మాత్రమే ఇచ్చారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని, అయినప్పటికీ చంద్రబాబు సూచనతో జగన్‌కు మంత్రుల తర్వాత ప్రమాణం స్వీకరాం చేసేందుకు అవకాశం ఇచ్చామని తెలిపారు.
కనీసం జగన్‌కు ఆ మర్యాద కూడా లేకుండా స్పీకర్ ఎన్నిక సమయంలో సభను బహిష్కరించారని మండిపడ్డారు. నా రాజకీయ జీవతంలో జగన్ లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. స్పీకర్ ఎన్నిక సమయంలో విపక్షం సభలో లేకపోవడం బాధకరమని అన్నారు. ఎవరైనా సరే సభ సంప్రదాయాలు పాటించాలని హితవు పలికారు. శాసన సభలో ప్రజా సమస్యలపై మాట్లాడితే వారికే మంచిదని, ఇది కౌరవ సభ కాదు గౌరవ సభ అని స్పష్టం చేశారు.