బాలికపై అత్యాచారం కేసు.. ఎస్పీ కీలక ప్రెస్ మీట్

by Mahesh |   ( Updated:2024-07-16 11:48:27.0  )
బాలికపై అత్యాచారం కేసు.. ఎస్పీ కీలక ప్రెస్ మీట్
X

దిశ, వెబ్ డెస్క్: మూడో తరగతి బాలికపై అదే పాఠశాలకు చెందిన ఏడో తరగతికి చెందిన ముగ్గురు బాలురు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించి సీరియస్ అయ్యారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై నంద్యాల ఎస్పీ అదిరాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేసి.. బాలిక మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్ లో పడేశారు. ఈ ఘటనకు సంబంధించిన ముగ్గు మైనర్లు అరెస్ట్ చేశాము. అయితే రిజర్వాయర్ లో పడేసిన బాలిక మృతదేహం మాత్రం ఇంకా దొరకలేదని.. గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నామని ఎస్పీ అదిరాజ్ మీడియాతో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed