Sonu sood: ఏపీలో చంద్రబాబు మార్క్ పాలన.. నటుడు సోనుసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |
Sonu sood: ఏపీలో చంద్రబాబు మార్క్ పాలన.. నటుడు సోనుసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో చంద్రబాబు మార్క్ పాలన కనిపిస్తోందని నటుడు సోనుసూద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన సోనుసూద్ చంద్రబాబు ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల పాలనలో చంద్రబాబు నాయుడు మార్క్ కనిపించిందని, ఆయన ఆధ్యర్యంలో నడుస్తున్న పాలనలో ప్రజలు సురక్షితంగా.. సంతోషంగా ఉన్నారని తెలిపారు. వంద రోజుల పాలనపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు మంచి విజన్ తో ముందుకు వచ్చారని, ఇందుకు గర్వంగా ఉందని అన్నారు. అలాగే త్వరలోనే మిమ్మల్ని మళ్లీ కలుస్తానని, అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా.. పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేగాక వంద రోజుల్లో ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, వరదల సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed